ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో వేడుక డౌటే?

231
ntr
- Advertisement -

మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న సినిమా ఎన్టీఆర్ బ‌యోపిక్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఈమూవీని తెర‌కెక్కిస్తుండ‌గా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న సొంత బ్యానర్లో తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తోండ‌గా.. ఆయ‌న భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ న‌టిస్తోంది. రెండు భాగాలుగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మొద‌టి భాగంగా ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని చూపించ‌గా..రెండ‌వ పార్ట్ లో రాజ‌కీయ జీవితంను చూపించ‌నున్నారు.

ntr biopic

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈసంద‌ర్భంగా ఈనెల 16వ తేదిన తిరుప‌తిలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అయితే 11 తేదిన తెలంగాణ‌లో ఓట్ల లెక్కింపు ఉండ‌టంతో వాటిపైనే జ‌నాలు ఎక్కువ‌గా దృష్టి పెడ‌తార‌ని భావిస్తున్నారు. అందవ‌ల్ల 16వ తేద‌ని ఆడియో వేడుక చేయాలా వ‌ద్దా అనే అలోచ‌న‌లో ఉన్నారట చిత్ర‌బృందం. పరిస్థితులను బట్టి 16న చేయాలనీ .. లేదంటే 21వ తేదీన చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -