రావణ గెటప్‌ అదిరింది..

240
ravana
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌ నుండి మరో అదిరిపోయే పిక్ రిలీజైంది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని క్యారెక్టర్స్‌ పోస్టర్స్‌,ఎన్టీఆర్ ఫస్ట్ లుక్,సాంగ్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి. తాజాగా ఆడియో రిలీజ్ డేట్‌ని అఫిషియల్‌గా కన్ఫామ్‌ చేస్తూ పిక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

డిసెంబర్‌ 21 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఆడియో వేడుక ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇందుకోసం అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఆడియో వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు,ఆయన సతీమణితో పాటు ఇండస్ట్రీలోని పెద్దలు హాజరయ్యే అవకాశం ఉంది.

ntr mahanayakudu

ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి తెరకెక్కించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు. ఇక పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్‌ని బీట్‌చేసే వారు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే రావణుడి గెటప్ లో ఉన్న బాలకృష్ణ ఫోటోను రిలీజ్ చేసింది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఫుల్ క్యాస్టింగ్ ఉండటం విశేషం. రావణుడి గెటప్ లో బాలకృష్ణ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యారు.

ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 వ తేదీన రిలీజ్ అవుతుంటే, మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ కానుంది.

- Advertisement -