వైఎస్‌ఆర్‌ పెన్షన్ కాదు..ఎన్టీఆర్ భరోసా

24
- Advertisement -

ఏపీలో పెన్షన్ పథకం పేరును మార్చింది చంద్రబాబు సర్కార్. ఇప్పటివరకు వైఎస్‌ఆర్ పెన్షన్ చేయూత పథకం పేరుతో పెన్షన్ అందుతుండగా దానిని ఎన్టీఆర్ భరోసా పథకంగా మార్చేశారు చంద్రబాబు.

గురువారం సాయంత్రం సచివాలయంలోని తన చాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు హామీలపై చంద్రబాబు సంతకాలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని చెప్పిన చంద్రబాబు ఆ దస్త్రంపై సంతకం చేశారు. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

Also Read:రుణమాఫీపై ఆంక్షలా?:నిరంజన్‌ రెడ్డి

- Advertisement -