దసరా పండగ సందర్బంగా థియేటర్లలో ఎన్టీఆర్ హవా నడుస్తోంది. ఎన్నో రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలన్న యంగ్ టైగర్ కల అరవింద సమేత ద్వారా నెరవేరింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన నాలుగురోజుల్లోనే వందకోట్ల క్లబ్ లో అడుగుపెట్టి ఎన్టీఆర్ గత చిత్రాల రికార్డులను తిరగరాసింది. అరవింద సమేత సక్సెస్ ను తెగ ఎంజాయ్ఎ చేస్తున్నాడు ఎన్టీఆర్.
ఓ వైపు అరవింద సమేత సక్సెస్ మీట్ లో పాల్గొంటునే మరోవైపు తన తర్వాతి చిత్రంపై దృష్టి సారించారు. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్ రాజమౌళితో ఎన్టీఆర్, రాంచరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే నెల 15 నుంచి సెట్స్ పైకి రాజమౌళి సినిమా వెళ్లనుంది. ఈ క్రమంలో ఇద్దరు హీరోలకు రాజమౌళి కఠోర శిక్షణ ఇస్తున్నారట. రాజమౌళి అనుకున్నట్లు ఎన్టీఆర్ లుక్స్ ఉండాలని ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. సుమారు 45 రోజుల పాటు శారీరక పరమైన కసరత్తులు చేపిస్తున్నాడు. బాహుబలితో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన రాజమౌళి ఇప్పుడు చేసే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అరవింద సమేత చిత్రం సక్సెస్ను ఎంజాయ్ చేసేందుకు ఎన్టీఆర్ అమెరికా వెళ్లాడు. ఇక బోయపాటి సినిమా రీషూటింగ్ పనిలో రాంచరణ్ పనిలో పడ్డాడు. దీంతో రాజమౌళి సినిమాకు కాస్త బ్రేక్ పడిందని ఫిల్మినగర్ టాక్.