టాలీవుడ్ సర్కిల్స్ లో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు తెరమీద రీమెక్ ట్రెండ్ నడుస్తుండగా…తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో మల్టీస్టారర్ మూవీలకు శ్రీకారం జరగబోతోందని టాక్. ఇప్పటికే వెంకీ,మహేష్ మల్టీస్టారర్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టగా కొన్ని సినిమాల్లో మంచు ఫ్యామిలీతో కలిసి నాగ్ సందడి చేశాడు. ఇక పవర్ స్టార్ పవన్ సైతం వెంకీతో కలిసి గోపాల గోపాల మూవీలో ప్రేక్షకులను మెప్పించాడు.
ఇక తాజాగా టాలీవుడ్లో ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండే నందమూరి-మెగా ఫ్యామిలీల నుంచి మల్టీస్టారర్ వస్తుందని టాక్. ఇప్పటికే కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతుండగా, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనుందట. గతంలో అల్లు అర్జున్ హీరోగా దేశముదురు, ఇద్దరమ్మాయిలతో.. ఎన్టీఆర్ హీరోగా ఆంద్రావాలా, టెంపర్ లాంటి సినిమాలను తెరకెక్కించిన పూరి, ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బన్నీ, ఎన్టీఆర్ కు కథ కూడా వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇంత భారీ చిత్రాన్ని నిర్మించాడానికి ఏ నిర్మాత ముందుకు వస్తాడో చూడాలి.
మరోవైపు అగ్ర నిర్మాత కేఎస్.రామారావు ఎన్టీఆర్-అల్లు అర్జున్ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్‌ను తయారు చేయించారట. ఈ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి ముందుగా ఎన్టీఆర్,బన్నీకే వినిపించాడట. దీంతో ఈ రెండు స్టోరీలలో ఏదో ఒక దానిని ఎన్టీఆర్-బన్నీ ఓకే చేస్తే అది టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్‌గా మిగిలిపోనుంది. ఎన్టీఆర్-అర్జున్ మల్టీస్టారర్ చేస్తారన్న వార్తలతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.