వెండితెరపై గీతామాధురి…?

324
- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని గాయకులూ హీరోలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి కాని, గాయనీలు హీరోయిన్లుగా మారిన సందర్భాలు చాలా తక్కువ. అయితే త్వరలో తెలుగు స్టార్ సింగర్ హీరోయిన్ గా మారనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్స్ తో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్ గీతామాధురి చిరుత సినిమాలో చమ్కా చమ్కా చమ్కీరే, వియ్ ల‌వ్ బ్యాడ్ బోయ్స్‌.. ! (బిజినెస్‌మేన్‌)… మ‌గాళ్లు వ‌ట్టి మాయ‌గాళ్లురా..! (గోలీమార్‌) అంటూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు, ఆ తర్వాత వేనుతిరిగి చూసుకోలేదు.

Geetha Madhuri makes her film debut

మాస్, క్లాస్, మేలోడి పాటలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది. హస్కీ వాయిస్ గీతామాధురికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. గ్లామర్ పరంగా ఆమెను వెండితెరపై చూపించాలని పలువురు ప్రయత్నాలు కూడా చేశారు. సున్నితంగా తిరస్కరించిన ఆమె ఇప్పుడు అతిథి అనే షార్ట్ ఫిల్మ్ లో లీడ్ రోల్ చేసి, తనలోని నటన ప్రతిభ కూడా ఉన్నదని నిరూపించుకుంది. ఇదే ఆమెకు ఓ వెండితెర అవకాశాన్ని ఇచ్చిందని అంటున్నారు సినీజనం.

Geetha Madhuri makes her film debut

అయితే,… త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఓ సినిమాలో గీతామాధురి నటించింది. ఈసినిమాలో గీతమాధురి హీరోయిన్ గా నటించిందా..? లేక అతిథి పాత్రలోనే కనిపించనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సింగర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గీతామాధురి, ఈసినిమా రిలీజ్ అయిన తరువాత నటిగానూ బిజీ అవుతుందన్న ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తోంది.

Geetha Madhuri makes her film debut

ఇటీవలే సింగర్‌ సునితకూడా వెండితెరపై కనిపించనున్నట్లు సోషల్‌మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగింది. ఇప్పుడు గీతామాధురికూడా సినిమాలో కి ఎంట్రీ ఇస్తున్నాట్టు వార్తలు షీకార్లు చేస్తున్నాయి. దీనిపై సునీత కాని గీతామాధురి కూడా ఇంత వరకు స్పందించాలేదు. దీనిపై క్లారిటీ రావలంటే మరికొన్నిరోజులు వేచిచూడక తప్పదు.

- Advertisement -