ఎన్టీఆర్..మరో మూవీ రీ రిలీజ్!

27
- Advertisement -

వివి వినాయక్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. అప్పటివరకు ఫ్యాక్షన్‌ రోల్స్‌తో మెప్పించిన ఎన్టీఆర్‌ను కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్‌లో చూపించిన చిత్రం ఇది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందిరిని ఆకట్టుకుంది. ఇక బుల్లితెరపై ఎప్పుడు స్ట్రీమింగ్ అయినా అదిరే రేటింగ్స్ రావాల్సిందే.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం మళ్లీ రీ రిలీజ్ కానుంది. నవంబర్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో బ్రహ్మానందం- చారిగా ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు, బ్రహ్మానందం – నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు నిజంగానే అదుర్స్. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం రీ రిలీజ్‌ ఏ విధమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్…కొరటాల శివతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:కాళోజీ జయంతి..తెలంగాణ భాషా దినోత్సవం

- Advertisement -