తెలుగువాడినైనందుకు గర్వంగా ఉంది:ఎన్టీఆర్

319
ntr balakrishna
- Advertisement -

ఎన్‌.బి.కె ఫిలింస్‌ పతాకంపై బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు పార్టులుగా కథానాయకుడు,మహానాయకుడు వస్తుండగా విద్యాబాలన్‌ కీలకపాత్ర పోషించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆడియో,ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరిత్రకు జయాలు అపజయాలు ఉండవని..చరిత్ర సృష్టించడాలే ఉంటాయన్నారు.ఒక కుటుంబసభ్యుడిగా ఇక్కడికి మాట్లాడేందుకు రాలేదని ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగు వాడిగా మాట్లాడటానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు.

ntr

చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో తాతయ్య గారూ అని సంబోధించిన నేను.. ఆయన గురించి తెలుసుకున్న తరువాత రామారావుగారు, అన్నగారూ అని సంబోధించడం మొదలు పెట్టా. ఎందుకంటే ఆయన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదని తెలుగు వాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగు వాడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి చెందిన ధృవతార ఎన్టీఆర్ అని కొనియాడారు.

తెలుగు వాళ్లు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో.. పక్క రాష్ట్రాల పేరుతో మనల్ని పిలుస్తున్న రోజుల్లో.. ఇదిరా తెలుగు వాడి గౌరవం. ఇదిరా తెలుగువాడి పౌరుషం. ఇదిరా తెలుగు వాడి ఖ్యాతి అని తొడకొట్టి గర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ఎన్‌.టి.ఆర్‌ జీవితం నుంచి నేర్చుకున్నదంటే మనం ఇచ్చిన కమిట్‌మెంట్‌ని గౌరవించాలి, క్రమశిక్షణతో సినిమా చేయాలన్నది గమనించాలన్నారు. బాబాయ్‌ నటించిన ‘బాలగోపాలుడు’ సినిమాతో నా నట జీవితాన్ని మొదలుపెట్టానని… ముప్పయ్యేళ్ల తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -