#NTR30 ఓపెనింగ్ వాయిదా

13
- Advertisement -

ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుండి ప్రాజెక్ట్ ముందుకెళ్లడం లేదు. వివిధ కారణాలతో సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ ఉండనుందని , మార్చ్ నుండి రెగ్యులర్ ఘాట్ స్టార్ట్ అవ్వనుందని ఎన్టీఆర్ అప్ డేట్ వదిలాడు. ఇప్పుడు ఆ ప్లాన్ లో మార్పు వచ్చింది. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కారణంగా ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్ వాయిదా వేసుకున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 24 న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓపెనింగ్ జరగాల్సి ఉంది. కానీ తారకరత్న మరణం కారణంగా ఇప్పుడు ఆ వేడుకను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కోసం తారక ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఆ రోజు వచ్చే సరికి ఇప్పుడు అనుకోకుండా వాయిదా పడింది.

వచ్చే నెల మళ్ళీ ఓ మంచి ముహూర్తం చూసి సినిమాను గ్రాండ్ లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. యువ సుద ఆర్ట్స్ పై మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే హీరోయిన్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -