ఎన్టీఆర్‌ – కొరటాల మూవీ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

37
ntr 30

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. వీరి కాంబోలో ఇదివరకే ‘జనతా గ్యారేజ్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని రూపొందిన విషయం విదీతమే. అయితే ఇప్పుడు కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌న‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఇక ఇందలో నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌ బయటికొచ్చింది. ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై నందమూరి కల్యాణ్‌ రామ్‌, కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. వచ్చే సంవత్సరం (2022) ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.