చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత తొలిగింపు

2
- Advertisement -

వీఐపీలకు NSG భద్రత ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి భద్రతను సీఆర్పీఎఫ్ పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ బాధ్యతలు సీఆర్‌పీఎఫ్‌ చూసుకుంటుంది. తిరుపతిలోని అలిపిరిలో చంద్రబాబుపై నక్సల్‌ దాడి జరిగిన సమయం నుంచి ఆయనకు ఎన్ఎస్జీ భద్రత కొనసాగుతోంది. సీఆర్పీఎఫ్‌ విభాగంలో వీఐపీ భద్రతా అవసరాల కోసం ఆరు బెటాలియన్లు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఏడుకు పెంచాలని నిర్ణయించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , బిఎస్‌పి అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ , కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ , నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు భద్రతా బాధ్యతలను ఇక నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పర్యవేక్షించనుంది.

Also Read:తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ సమావేశం

- Advertisement -