- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగును పూర్తిచేసుకుంది. దసరాకి ఈ సినిమా థియేటర్స్ లో ఉండాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.
అయితే ఈ చిత్రం విడుదల తేదీలో మార్పులు జరిగాయనే వదంతులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘‘జై లవ కుశ’ విడుదల తేదీ గురించి వస్తున్న వదంతులు వాస్తవం కాదు.
ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. ‘లవ’ టీజర్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’ అని ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా..బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలోని ‘లవ‘ ఫస్ట్ లుక్ ఈ నెల 6న విడుదలైన విషయం తెలిసిందే.
- Advertisement -