- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గ్రామాల్లో మన ఊరు మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మన బడితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఎన్నారైలకు విధి విధానాలను వివరించి వారిని ఇందులో భాగస్వాములను చేయనుంది.
ఫిబ్రవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై సంఘాలతో జూమ్ ఆన్‌లైన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొననున్నట్టు ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. రూ.10 లక్షలు దానం చేసిన దాతలకు వారు సూచించిన వారి పేరును పాఠశాలకు పెడుతారని మహేష్ తెలిపారు. ఎన్నారైలందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
- Advertisement -