బీఆర్ఎస్ కు అంతర్జాతీయస్థాయిలో మద్దతు

260
- Advertisement -

మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజార్టితో గెలుస్తుందని ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా అన్నారు. బీజేపీ తన సొంత ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజల అభిమానాన్ని తాకట్టు పెట్టి ఉప ఎన్నిక తీసుకొచ్చిందన్నారు. సిడ్నీలో బిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ ఎన్ఆర్ఎఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా , ఎమ్మెల్సీ సురభి వాణి హాజరు అయ్యారు .

మహేష్ బిగాలా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ జాతీయ రాజకీయాల గురించి చర్చ వచ్చిన ఎన్నారైలు అందరూ బిఆర్ఎస్ గురించి చర్చిస్తున్నారు. కెసిఆర్ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుంది తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరిస్తే పేద ప్రజలకు న్యాయం అవుతుందన్నారు. ఒక తెలంగాణనే కాకుండా మిగితా రాష్ట్రాల వారు కూడా బిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతుందన్నారు.

మునుగోడులో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడం కాయం అన్నారు మహేష్ బిగాలా. ఒక కాంట్రాక్టర్ తన సొంత లబ్ది కోసం ఉప ఎన్నిక తెచ్చి ఇప్పుడు అందరిపై భారం వేస్తున్నారు .తెరాస చేసిన సంక్షేమం మునుగోడు లో విజయం సాదిస్తుందని అన్నారు . ఇక రాబోయే రోజులల్లో బీజేపీ పార్టీ ఖాళీ కావడం కాయం అన్నారు.

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ గుణాత్మక మార్పుకై భారత రాజకీయాలలోకి కెసిఆర్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఆర్ఐలు ముక్తకంఠంతో కేసిఆర్ దేశ రాజకీయాలలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఈ సమావేశం లో సభ్యులు వెంకట రమణ రెడ్డి మర్రి, రవీందర్ చింతామణి, పరశురామ్ ముతుకుల, కిషోర్ బెందే, లక్ష్మణ నల్ల, రాహుల్ రాంపల్లీ, సాంబ శివ మల్గారి, మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఏజాజ్, భోజి రెడ్డి, మధు కలం, ప్రవీణ్ జంబుల, నిఖిల్ గడ్డమీద తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

కేదార్​నాథ్​ ఆలయం స్వర్ణశోభితం

మునుగోడుకు సీఎం..మాస్టర్ ప్లాన్

కాంగ్రెస్‌లో జోడో జోష్

- Advertisement -