లండన్ : తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను నియమించినందుకు లండన్ లోని ఎన్నారైలు సంబరాలు చేసుకున్నారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ప్రవాస తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవమని కేసీఆర్‌కు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలియజేసారు.
అనిల్ కూర్మాచలంకు దక్కిన గౌరవానికి లండన్ లో ఎన్నారైలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఉద్యమ కాలం నుండి కేసీఆర్ వెంటే నడుస్తూ ప్రతి ఉద్యమ పిలుపుకు ముందున్నారు. తెలంగాణ కోసం ఎన్నో ర్యాలీలు ధర్నాలు చేసి నేడు బంగారు తెలంగాణ కోసం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఒక క్రమ శిక్షణ గల ఉద్యమకారునికి దక్కిన గౌరవం అని ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు అశోక్ దూసరి తెలిపారు.
ఇది ప్రపంచ దేశాలలో వున్నా ప్రతి ప్రవాస బిడ్డకు దక్కిన గౌరవం. అనిల్ కూర్మాచలం జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. ఇలాగే ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేరుకొని కేసీఆర్ అడుగు జాడల్లో బంగారు తెలంగాణ కోసం కృషి చెయ్యాలని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.
ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులు ప్రభలత, నిత్య కేసీఆర్, కేటీఆర్, కవితలకు అలాగే ఇతర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ను తెరాస పార్టీని నమ్ముకొని క్రమశిక్షణగా పని చేసిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని మరోసారి రుజువైంది. మా కుటుంబ సభ్యుల పక్షాన లండన్ లోని ఎన్నారై సంస్థలకు, మిత్రులకు ప్రభలత కూర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంబరాలలో ఎన్నారై తెరాస యుకె అధ్యక్షులు అశోక్ దుసరి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుడుల, కుటుంబం సబ్యులు ప్రభలత కూర్మాచలం, నిత్య శ్రీ, టాక్ మరియు ఎన్నారై తెరాస నాయకులు వెంకట్ రెడ్డి దొంతుల,స్వాతి బుడగం, శుష్మున రెడ్డి, సత్య చిలుముల, సురేష్ బుడగం, జాహ్నవి ,నవీన్ రెడ్డి, రవి రెటినేని, సుప్రజ పులుసు, మల్లా రెడ్డి, హరిబాబు గౌడ్ నవాపేట, శ్రీ శ్రావ్య వందనపు, సత్యపాల్ రెడ్డి పింగిలి, రవి ప్రదీప్ పులుసు, పృథ్వీ రావుల,అపర్ణ, రవికిరణ్, మణి తేజ, జస్వంత్, నికిల్ తదితరులు పాల్గొన్నారు.