- Advertisement -
రాష్ట్రంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు నిర్వహించగా, 434 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 292 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,97,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా…. 7,90,347 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,680 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
- Advertisement -

