లండన్‌లో “కెసిఆర్ కూపన్స్”తో విద్యార్థులకు సహాయం..

264
- Advertisement -

గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నితావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి ప్రభుత్వాలు అక్కడ వీలైనంత సహాయం చేస్తున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్య్వక్తులు, సంస్థలు ఆపదలో ఉన్నవాళ్లకు వీలైనంత సహాయం చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు ఎన్నారై తెరాస యూకే విభాగం తెలియజేసింది.

తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్‌కు గత సంవత్సరం నుండి వెయ్యిల మంది విద్యార్థులు ఉన్నత చదువు కోసం వచ్చారని, కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ విద్యార్థులు వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారని. ఎన్నారై తెరాస యూకే విభాగం వీలైనంత సహాయం చేస్తూ వారికి అండదండగా ఉందని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ ” కెసిఆర్ కూపన్స్ ” పేరుతో సామాజిక దూరాన్ని పాటిస్తూ సుమారు 200 లకు పైగా విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారి స్థానిక దుకాణాలల్లో తీసుకొనేలాగా ఏర్పాటు చేశామని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

అలాగే మరొక్కసారి కూపన్ ఆవిష్కరించి ప్రోత్సహించిన ఎంపీ సంతోష్ కుమార్‌కి అశోక్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి స్ఫూర్తితో, మంత్రి కే.టీ.ఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రవాసులకు సహాయం చేస్తూ వారిలో మానసికస్థైర్యాన్ని నింపుతున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఎన్నారై తెరాస యూకే సభ్యులు గత నెల రోజుల నుండి స్థానికంగానే కాకుండా క్షేత్రస్థాయిలో ఎంతోమందికి నిత్యావసరాలు అందించారని, యూకేలో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారికి ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని nritrs@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

Ashok

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశమే గర్వించే విధంగా ప్రజలను కరోన మహమ్మారి నుండి కంటికి రెప్పలా కాపాడుతున్నారని , కాబట్టి ప్రజలంతా వారికి సహకరించి సామాజికదూరం పాటించాలని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి కోరారు. టి.ఆర్.యస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షా అని తెలిపారు.

విద్యర్థులకు అందించిన నిత్యావసరాలకు సహకరించిన అనిల్ కూర్మాచలం, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, సతీష్ గొట్టెముక్కల, రమేష్ ఈసెంపల్లి, హరి నవాపేట్, సురేష్ గోపతి,శివ గౌడ్, రవి ప్రదీప్ పులుసు, సృజన రెడ్డి చాడ తదితరులకు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -