టెస్కో ద్వారా క్లాత్ మాస్క్‌ల తయారీ.. అమ్మకం..

250
Jayesh Ranjan IAS
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ( టెస్కో ) చేనేత రంగము ను ప్రోత్సహించుటకు, చేనేత కార్మికులు (కళాకారులకు) నిరంతర ఉపాధి కల్పించుట అనే ఉదేశముతో రిజిస్టర్ కాబడిన కేంద్ర (అపెక్స్) మార్కెటింగ్ సంస్థ. ఈ సంస్థ తెలంగాణలోని చేనేత ఉత్పత్తులను ముఖ్యముగా 1) పోచంపల్లి ఇక్కట్ (టై అండ్ డై) 2) గద్వాల్ సిల్క్, కాటన్, సీకో చీరలు 3) సిద్దిపేట గొల్లబామ చీరలు 4) నారాయణపేట సిల్క్, కాటన్ చీరలు 5) వరంగల్ డర్రీస్ మరియు కరీంనగర్ దుప్పట్లు, టవ ళ్లు మొదలగు రకాల ఉత్పత్తులను ప్రోత్సహించుచున్నది.

టెస్కో తమ ఉత్పత్తులను రాష్ట్రములో ని (24) సేల్స్ షోరూం లలో, రాష్ట్ర వెలుపల (7) సేల్స్ షోరూం లలో దేశవాత్తముగా మొత్తం (31) సేల్స్ షోరూంల ద్వారా అమ్మకములు జరుపు చున్నది. మరియు ఈ కామర్స్ అమ్మకములు tsco.co.in ద్వారా జరుపు చున్నది. చేనేత పటము నుండి అంతరించి పోవుచున్న ఒకప్పటి మహోన్నత కళలైన గొల్లభామ చీరలు, పీతాంబరి చీరలు, ఆర్ముర్ పట్టు చీరలు మరియు హిమ్రు వస్త్రములను టెస్కో పునరుజ్జీవింప చేయుచున్నది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టెస్కో సంస్థకు హితోధికమైన తోడ్పాటు కల్పించుచున్నది. ప్రభుత్వము బతుకమ్మ చీరలు, పాఠశాల విద్యార్థుల యూనిఫారములు,కెసిఆర్ కిట్స్, రంజాన్ గిఫ్ట్స్, క్రిస్మస్ గిఫ్ట్స్ మొదలగు పథకాల ద్వారా వస్త్రముల ఉత్పత్తిని టెస్కో సంస్థకు అప్పగించుచున్నది. మరియు అన్ని సంక్షేమ శాఖలలో వస్త్రాలు కొనుగో ళ్లను టెస్కో ద్వారా జరుపుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం, కోవిడ్ -19 మహమ్మారి విస్తరిస్తున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు, టెస్కో ‘ కార్పొరేట్ సామజిక బాధ్యత’క్రింద రెండు లక్షల మాస్కులను కుట్టించి సామాన్య ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ద్వారా ఉచితంగా పంపిణీ చేయుటకు పూనుకున్నది.

దీనితో పాటు టెస్కో తనవద్ద ఉన్న వస్త్రాలతో మూడు లక్షల మాస్కులను కుట్టించి ప్రతిఫలాపేక్షలేకుండా టెస్కో ఎగుమతుల షోరూం, చేనేత భవనము, నాంపల్లి, హైదరాబాద్ నందు అమ్మకములకు ఉంచినది. వినియోగదారుల అవసరాల మేరకు ఉత్పత్తి మరియు అమ్మకములు చేపట్ట బడును. ఈ మాస్కులు ఉతికి, తిరిగి ఉపయోగించుటకు వీలైనవి.

జయేష్ రంజన్ ఐ.ఏ.ఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్టుమెంటు, తెలంగాణ ప్రభుత్వం వారు ఈ రోజు మాస్క్ ల అమ్మకపు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శైలజ రామయ్యర్, ఐ.ఏ.ఎస్, సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ మరియు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం (టేస్కో) హాజరైనారు.

ఈ మాస్క్ లు త్వరలో రత్నదీప్ సూపర్ మార్కెట్ లలో అమ్మకమునకు అందుబాటులో ఉంచబడును. ఈ మాస్కులు తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవడము జరిగినది, ఇవి రెండు డిజైన్లలో రూ .20/- మరియు రూ .40/- లలో లభించును మరియు ఉదయం గం. 10.30 ల నుండి సాయంత్రం గం. 2.00 ల వరకు కొనుగోలు చేయుటకు అవకాశం కలదు.

- Advertisement -