కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుకునేదే ఈ సభ..

264
NRI TRS UK

లండన్: టి.ఆర్.యస్ పార్టీ సెప్టెంబర్ 2వ తేదీనాడు జరపబోయే చారిత్రాత్మక “ప్రగతి నివేదన సభ”పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల పాల్గొన్నారు.

ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని, ఎవరు కూడా ఆలోచించలేని చారిత్రాత్మక సభకు మన కేసీఆర్‌ పిలుపునిచ్చారని, ఖచ్చితంగా అనుకున్న 25 లక్షల కంటే ప్రజలు ఎక్కువగానే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ప్రగతి కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టే నివేదన సభ మాత్రమే కాదని, అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌కి కృతజ్ఞత తెలుపుకొనే కృతజ్ఞత సభ కూడా అని తెలిపారు.

CM KCR

దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చెయ్యని సంక్షేమాలని మన కేసీఆర్‌ ప్రజలకు అందించారని, నేడు కుల మతం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి చేశారని అటువంటి నాయకుడి పిలుపు మేరకు లక్షలాదిగా తరలి వచ్చి “ప్రగతి నివేదన సభ” ను విజయవంతం చేయాలని ప్రజలని కోరారు. అలాగే ప్రతిపక్షాలుపై నిప్పులు చెరిగారు, ప్రజా నాయకుడు కేసీఆర్‌ కాబట్టే ప్రజలపై నమ్మకంతో 25 లక్షల మందితో సభను నిర్వహిస్తున్నారని, దీని బట్టే అర్థం చేసుకోవాలి ఇక రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల ఉనికి శూన్యమని, ప్రజలంతా కేసీఆర్‌ వైపే ఉన్నారని. సభ తేదీని ప్రకటించినప్పటి నుండి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడంలేదని, మా పార్టీ కంటే ఎక్కువ వారే సభ గురించి ఎక్కువ మాట్లాడి..విమర్శించి ఉచిత ప్రచారం ఇస్తున్నారని, దానికి కృతజ్ఞత తెలుపుతున్నాని చమత్కరించారు.

NRI TRS UK

మా ఎన్నారై తెరాస సభ్యులు కూడా సభకు హాజరవుతారని, నాటి ఉద్యమం నుండి నేటి వరకు కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి పిలుపు అందుకొని వారి వెంట నడిచి మా వంతు బాధ్యతగా అన్ని కార్యక్రమాలు విజవంతం చేయడానికి కృషి చేశామని, అలాగే చారిత్రాత్మక “ప్రగతి నివేదన సభ” ను విజయవంత చేయడానికి అన్ని రకాలుగా పని చేస్తామని తెలిపారు.తెలంగాణ ప్రజల అభివృద్ధికి కేసీఆర్‌ నాయకత్వమే మనకు అవసరమని అన్ని సందర్భాల్లో వారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలని కోరారు, ప్రజలంతా లక్షలాదిగా తరలి వచ్చి సభను విజవంతం చేసి కేసీఆర్‌కి కృతజ్ఞత తెలిపుకుందామని కోరారు.