ఆసరా పెన్షన్స్ అద్భుతం : ఎన్నారై టీఆర్ఎస్

252
NRI TRS Praises aasara pension scheme
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ పథకం అద్భుతమని ఎన్నారై టీఆర్ఎస్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఎంపీ కవితకు వినతిపత్రం సమర్పించిన ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులు మరింత మందిని ఆసరా పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని సూచించింది.

1000  రూపాయల ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఎన్నారై తెరాస యుకె శాఖ కార్యదర్శి చాడ సృజన రెడ్డి అధ్యయనంలో తేలిందని ఎంపీకి తెలిపారు. ఈ అధ్యయనం లో భాగంగా పెన్షన్ రాని వారి ఆర్ధిక కుటుంబ పరిస్థితులను క్షున్నంగా పరిశీలించారు సృజన రెడ్డి.మొత్తం అధ్యాయనాన్ని ఒక రిపోర్ట్ గా తయారు చేసి ఎంపీ కవిత కామన్ వెల్త్ ఉమెన్  పార్లమెంటేరియన్స్ సదస్సుకు లండన్ వెళ్లిన సందర్బంగా ఎన్నారై తెరాస యుకె శాఖ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో రిపోర్ట్ ని సభ్యుల చేతుల మీదగా  అందచేయడం జరిగిందని సృజన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్బంగా ఎన్నారై టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులను కవిత అభినందించారు. తెలంగాణ ప్రభుత్వానికి సలహాలు,సూచనలు ఇవ్వాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు – నవీన్ కుమార్, అశోక్, శ్రీకాంత్ పెద్దిరాజు , ప్రధాన కార్యదర్శి శ్రీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శులు – సృజన రెడ్డి చాడ సంయుక్త కార్యదర్శి – మల్లా రెడ్డి అడ్వైజరీ  బోర్డు సభ్యులు సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ కుమార్ వీర ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , కోశాధికారి మధుసూదన్ రెడ్డి,లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి,ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల  ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , మరియు ముఖ్యసభ్యులు రవి కుమార్ రత్తినేని హాజరైన వారిలో ఉన్నారు.

- Advertisement -