హుజురాబాద్ లో ఎగిరేది గులాబీ జెండానే..

247
nri trs
- Advertisement -

ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం గారు మాట్లాడుతు రాబోయే ఉపఎన్నికల్లో కెసిఆర్ గారి నాయకత్వంలో తెరాస అభ్యర్థిని భారీమెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ నేడు ఈ కార్యక్రమాలన్నీ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటే ప్రతిపక్షాలుమాత్రం వారి రాజకీయ లబ్దికోసం పనికిమాలిన, నీతిమాలిన విమర్శలు చేస్తున్నారని అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.

కెసిఆర్ గారి నాయకత్వం ఉంటేనే రైతుబంధు, దళితబంధు లాంటి కార్యక్రమాలు మరెన్నో వస్తాయని లేనియెడల ప్రతిపక్షాలకు అవకాశమిస్తే అన్ని బంద్ అవుతాయని ప్రజలకు వివరించారు.కెసిఆర్ గారు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ని సొంత తమ్ముడిలా భావించి వారిని రాజకీయంగ ప్రోత్సహించి వారికి ఎన్నో అవకాశాలు కలిపించారని కానీ వారు మాత్రం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా, పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించి, వారు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, స్వప్రయోజనాలకోసం బీజేపీ లో చేరి తల్లీలాంటి తెరాస పార్టీ నాశనం కావాలని కోరుకుంటున్నారని వీటన్నింటిని ప్రజలు గమిస్తున్నారని తప్పకుండ రాబోయే ఉప ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తారని అనిల్ కూర్మాచలం తెలిపారు. స్వయంగా ఈటెల రాజేందర్ గారు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కరోనా రెండోదశలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు బీజేపీ ని వ్యతిరేకించిన ఈటెల అదే పార్టీలో ఎందుకు చేరినరో ప్రజలందరు ఆలోచించాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు.ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత NRI తెరాస యూకే ప్రత్యేక కార్యాచరణతో తెరాస అభ్యర్థిని గెలిపించడానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తుందని తెలిపారు.

ఈ సమావేశానికి NRI తెరాస వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం గారు, NRI తెరాస యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రాజ్ కుమార్ శానబోయిన మరియు విక్రమ్ కుమార్, తిరుమందాస్ నరేష్, రఘువరన్ హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్ హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్ రెడ్డి, హుజురాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ గాలి రాకేష్, టిఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -