రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందునిచ్చారు. ఎన్నారై టీఆర్ఎస్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఎన్నారై టి ఆర్ యస్ అధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ముస్లిం, హిందువుల మత సామరస్యానికి రంజాన్ దీక్షలు ప్రతీక అని అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లింలకు రాజకీయంగా సామాజికంగా అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు, డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీలుగా, ఉప కులపతులుగా, కార్పొరేషన్ ఛైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఇలా ఎన్నో ఉన్నతమైన పదవులనిచ్చి, మైనారిటీ ల పట్ల ప్రత్యేక శ్రద్ధతో మన ప్రభుత్వం పని చేస్తుందని, మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ముస్లింలకు మంచి జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మైనారిటీల సంక్షేమం విషయంలో దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తున్నదని,ప్రత్యేకించి పేద మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అలాగే ఇటీవల ప్లీనరీ సమేవేశాలకెళ్లినప్పుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పై చేసిన దిశా నిర్దేశం పై మైనారిటీ సోదరులకు వివరించి వారి ఆలోచనలను తెలియజేసి, బాధ్యత గల భారతీయులుగా మనమంతా కెసిఆర్ గారి వెంటే ఉండి, తెలంగాణ అభివృద్ధిని ఇక భారత దేశం నలువైపులా జరిగేలా కృషి చెయ్యాలని కోరారు. మైనారిటీల సంక్షేమం కేవలం కెసిఆర్ గారి వల్లే సాధ్యమని తెలిపారు.
టాక్ అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి, మాట్లాడుతూ ఇలాంటి పర్వదినాల సందర్భంగా మతసామరస్యం పెంపొందుతుందని చెప్పారు.ముస్లింలు అత్యంత నియమ నిష్ఠలతో రంజాన్‌ను జరుపుకొంటారని చెప్పారు. ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం, అలాగే కెసిఆర్ గారు ముస్లింల అభివృద్ధికి తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. ముస్లింలకు మంచి జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు.భారత దేశంలో ఎక్కడ లేని గంగ జామున తహజీబ్ మన తెలంగాణ కే సొంతమని, ప్రజలంతా అన్నదమ్ములా కలిసి ఉంటారని, అది దేశానికే ఆదర్శమని చెప్పారు.
ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడ లేని గంగ జామున తహజీబ్ మన తెలంగాణ కే సొంతమని, ప్రజలంతా అన్నదమ్ములా కలిసి ఉంటారని, అది దేశానికే ఆదర్శమని చెప్పారు.ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ భిన్నత్వంలో… ఏకత్వంలా హిందూ-ముస్లిం వర్గాలవారు కలసిమెలిసి, రంజాన్ జరుపుకోవడం మతసామరస్యానికి నిదర్శనమన్నారు
ఈ సంధర్భంగా హాజరైన హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడు ముజీబ్ ఇఫ్తార్ విందు అనంతరం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రమంగా తప్పకుండ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ సమాజానికి ఆదర్శనంగా నిలుస్తున్న ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ ని అభినందించి, కెసిఆర్ గారి నాయకత్వం లో ముస్లిం లు ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని, ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నామని, మత సామరస్యానికి ప్రతీక ఐన రంజాన్ పండుగ ఉపవాస కార్యక్రమాలు ఎంతో పవిత్రమైనవన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు వైస్ చైర్మన్ దొంతుల వెంకట్ రెడ్డి, అడ్వైసర్ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్య చిలుముల,రవి ప్రదీప్ పులుసు, వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం మరియు ముఖ్య సభ్యులు రవి రేటినేని మరియు టాక్అడ్వైసర్ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు రాజేష్ వాకా,వెంకీ సుదిరెడ్డి,నగేష్ ,రాకేష్,రవీందర్ రెడ్డి,రవికిరణ్ మామిడి,నాగరాజు మరియు హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ సభ్యులు ముజీబ్, సయ్యద్,షేక్ సాబ్, షా నవాజ్,మసూద్, షరీఫ్, షా సాబ్, ఆదిల్, ఫయాజ్, ఫైసల్ ఖాన్ హాజరైన వారిలో ఉన్నారు.