గ్రీన్ చాలెంజ్..మొక్కలునాటిన సౌతాఫ్రికా టీఆర్ఎస్

533
green challenge
- Advertisement -

ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం అనే మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఈ హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కర్యక్రమం ఇంతింటై వటుడింతే అన్నట్టుగా .. హరిత ఉద్యమంగా రూపుదాల్చింది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్ల మైలురాయిని అధిగమించి అపురుప ఘట్టంగా నిలిచింది.

సినీ,రాజకీయాలకుఅతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతుండగా ఎన్నారైలు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎన్నారై టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా అమెరికాలో మొక్కలు నాటారు. ఇందులో భాగస్వామ్యం కావాల్సిందిగా సౌతాఫ్రికా టీఆర్ఎస్ అధ్యక్షుడు గుర్రాల నాగరాజును నామినేట్ చేయగా ఆయన ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు.

గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో తెలుగు ఎన్నారైలు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మిడ్రాండ్ జోహన్నెస్ బర్గ్‌ డ్రీమ్ హిల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొక్కలు నాటారు.విద్యార్థులకు 60 మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గుర్రాల నాగరాజు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్ చాలెంజ్‌కి సౌతాఫ్రికాలోని మరికొంతమందిని నామినేట్ చేశారు.

Green Challenge Green Challenge Green Challenge Green Challenge Green Challenge Green Challenge

- Advertisement -