ఏపీ సీఎం జగన్ తో  చిరంజీవి భేటీ

467
Chiru Jagan
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి భార్యతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులకు సీఎం జగన్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా చిరంజీవి సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు.

మరోవైపు వీరిద్దరి భేటీలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు ఏపీలో జోరుగా చర్చజరుగుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తాజాగా జగన్ కు కలవడంపై సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ను కలిసేముందు చిరంజీవి హైదరబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిసి వెళ్లారు.

- Advertisement -