ఉన్నత చదువులకు యూకే వచ్చిన ప్రవాస విద్యార్థుల సహాయం కోసం ఇటీవల టి.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ స్పూర్తితో ప్రారంభించిన ‘కెసీఆర్ కూపన్స్’ కార్యక్రమం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడిందని ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
మొదటి విడతగా 200 మంది పైగా విద్యార్థులకు సహాయం అందించిన విషయం తెలిసిందే, అలాగే రెండో విడతలో కూడా 200 మంది పైగా విద్యార్థులకు ‘కెసీఆర్ కూపన్స్’ అందించామని అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
కొన్ని వందల మంది విద్యార్థులు సహాయం కోసం మమ్మల్ని సంప్రదించారని, వారి పరిస్థితులు చూసి చలించిపోయామని, ఎన్నో ఆశలతో విదేశాలకు వచ్చిన తోటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరమని వీలైనంత సహాయం చెయ్యడానికి సంస్థ కార్యవర్గ సభ్యుల సహాహాకారమే కాకుండా ఇతర మిత్రుల శ్రేయోభిలాషుల సహకారం తో విద్యార్థులకు సేవ చేస్తున్నామని అశోక్ తెలిపారు.
ఇప్పటి వరకు లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఎన్నారై తెరాస యూకే సంస్థ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా యూకే లో 500 పైగా విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్రం లో వివిధ ప్రాంతాల్లో వందల మంది పేదలకు నిత్యావసరాల సరుకులు అందించడం జరిగిందని అశోక్ తెలిపారు.
చివరిగా ‘కెసీఆర్ కూపన్స్’ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి ప్రశంశలందుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి పర్యవేక్షించి మమ్మల్ని ముందు నడిపించిన ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే, సహకరించిన కార్యవర్గ సభ్యులకి, తెరాస నాయకులకు, శ్రేయాభిలాషులకు కృతఙ్ఞతలు తెలిపారు.