తెలంగాణ రైతన్నకోసం లండన్ లో ఎన్నారై తెరాస మహా ధర్నా

177
trs
- Advertisement -

టి. ఆర్. యస్ పార్టీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం వెంటనే కొనుగోలు చెయ్యాలని, అలాగే వరి ధాన్య సేకరణ విధి విధానాలను కేంద్రం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎన్నారై తెరాస యూకే శాఖ లండన్ లో భారత హై కమీషన్ ముందు తెలంగాణ రైతన్న కోసం మహా ధర్నా నిరనస కార్యక్రమం నిర్వహించారు.

ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ, నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లండన్ లో ఇలాంటి నిరసన కార్యక్రమాలని ఎన్నారై తెరాస నిర్వహించిందని, పోరాటాలు మాకు కొత్త కాదని, గతం లో పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా ఇక్కడే నిరసన చేశామని, నేడు ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అనేక సార్లు ఢిల్లీ వెళ్లి రైతుల గోసను వివరించారని, పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారని, అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారని, కానీ ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే వారి ధాన్య సేకరణ విధి విధానాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు.

ఎన్నారై తెరాస అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసిన సంగతి తెలిసిందేనని . ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ గారు తన లేఖలో ప్రధానిని కోరారని. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విన‌తి చేశారని. 2021-22 ఖ‌రీఫ్‌లో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాల‌ని సీఎం ప్ర‌తిపాదించారని. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాలని రవి ప్రదీప్ డిమాండ్ చేసారు.

ఎన్నారై తెరాస లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి మాట్లాడుతూ, వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొందని. రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదని. ప్రతి ఏడాది ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని నవీన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఎన్నారై తెరాస యూకే కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం , దేశ రైతుల విజయమని , ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రైతు మహా ధర్నా ద్వారా కేంద్రంలో మార్పు వచ్చినట్టు మేము భావిస్తున్నామని, అమరులైన రైతులకు నివ్వాలర్పిస్తున్నామని , వారి స్ఫూర్తి పోరాటపటిమ గొప్పదని, గతంలో రైతులకు మద్దతుగా లండన్ లో నిరసన తెలిపామని గుర్తుచేసుకున్నారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా నూతన వ్యవసాయ చట్టాలన్నీ వెనక్కి తీసుకొనే వరకు చిత్తశుద్ధితో ప్రధాని మోదీ గారు పని చెయ్యాలని విజ్ఞప్తి చేసారు.

ఎన్నారై తెరాస కోర్ కమిటీ సభ్యుడు రావుల పృద్వి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎటువంటి పిలుపునిచ్చిన బాధ్యత గల తెరాస కార్యకర్తలుగా వారి వెంటే ఉండి నడుస్తామని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్నో గొప్ప పథకాల్ని ప్రవేశపెట్టి, రైతు రాజయ్యే విధంగా కెసిఆర్ పని చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రానికి సహకరించి, వరి కొనుగోళ్లలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు.

చివరిగా భారత హై కమీషన్ ప్రతినిధికి ఎన్నారై తెరాస నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి, కార్యదర్శి సత్య మూర్తి చిలుముల , కోర్ కమిటీ సభ్యుడు రావుల పృద్వి ముఖ్య నాయకులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

- Advertisement -