బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 77 హైలైట్స్

25
shannu

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 77 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 77వ ఎపిసోడ్‌లో భాగంగా సిరి- షన్ను మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇస్తారని సన్నీకి ముందే తెలుసు అని ఇన్ని నాటకాలు ఎందుకు అని సిరి, ఆనీ మాస్టర్ బాధపడ్డారు. చివరికి సరి,అనీ మాస్టర్ ఇద్దరు బొమ్మలు కాలితే సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందనేదే తన ఆట అని కాజల్ చెప్పడంతో ఆనీ మాస్టర్ అగ్గిలం మీద గుగ్గిలమైంది.

ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్న సన్నీకి ఆ పవర్‌ను సరైన సమయంలో ఇస్తాను అని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో మానస్, ప్రియాంక, కాజల్, సన్నీలు ఫుల్ ఖుషీ అయ్యారు. తర్వాత రవితో గేమ్ ఆడించాడు నాగార్జున. బంగారం, బొగ్గు అంటూ రెండింటిని ముందు పెట్టారు. బెస్ట్ పర్ఫామెన్స్‌కు గోల్డ్ ఇవ్వమని, వరస్ట్ పర్ఫామెన్స్ అనుకునే వారికి బొగ్గు ఇవ్వమనే టాస్క్‌ను రవికి ఇవ్వగా గోల్డ్‌ను ప్రియాంక, మానస్, ఆనీ, శ్రీరామచంద్రలకు సన్నీ, కాజల్, సిరి, షన్నులకు బొగ్గును ఇచ్చాడు.

అన్ని టాస్క్‌లు ముగిసిన తరువాత.. సిరి, షన్ను, మానస్, ఆనీలను కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు నాగ్. మొదటగా సిరిని పిలిచాడు. నీ బాధ ఏంటి? ఏమైంది? ఎందుకు అలా తలను బాదుకున్నావ్ అని నాగార్జున అడిగాడు. నేను వెరీ ఎమోషనల్ పర్సన్.. ఆ ఎమోషన్ ఎందుకు వస్తోందో కూడా ఎందుకో అర్థం కావడం లేదు.. ఇది తప్పా రైటా? అని కూడా తెలియడం లేదు…. తప్పు అని తెలిసినా కూడా చేసేస్తున్నా అంటూ తెలిపింది. తర్వాత షన్ను లోపలికి వెళ్లగా సిరి అలా చేసుకోవడంలో ఎవరిది తప్పు అని అడిగాడు. అది నా తప్పే సర్.. నేను అంతలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే.. సిరి అలా చేసి ఉండేది కాదు అన్నాడు.

తర్వాత మానస్ వచ్చాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. కానీ ప్రియాంక విషయంలో ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నావ్ అని తెలిపాడు. మనకు ఆట ముఖ్యం. బిగ్ బాస్ కప్ ముఖ్యమని చెబుతాను సర్. కానీ ఆమె ఎక్కువగా నా మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది సర్ అని తెలపగా ఏదైనా సరే నిర్మోహమాటంగా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.. ఇప్పుడు చెబితే ఏమనుకుంటుందో అని అనుకుంటున్నావ్.. ఇంకా ఫీలింగ్స్ ఎక్కువయ్యాక చెబితే? ఎలా ఉంటుంది అని మానస్‌కు సూచించారు.

తర్వాత ఆనీ మాస్టర్‌ను లోపలికి పిలిచి మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ అంటే తేడా తెలుసు కదా? ఎక్కడి వరకు ఆపాలో తెలియాలి.. కాజల్ విషయంలో ఇమిటేషన్ స్థాయి దాటిపోతోంది అని చురకలు అంటించాడు. తర్వాత శ్రీరామచంద్ర సేఫ్ అయినట్టు ప్రకటించారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడదు. ఎలిమినేషన్ కాకుండా కాపాడుతుందని తెలిపాడు నాగ్. అది నీ కోసమైనా వాడుకోవచ్చు లేదా నీకు నచ్చిన వారి కోసమైనా వాడుకోవచ్చు అని చెబుతూ సన్నీ సేఫ్ అయినట్టు ప్రకటించారు.