ఎన్నారై టిఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాద్యక్షులు శ్రీకాంత్ పెద్డిరాజు అధ్యక్షతన ఈస్ట్ హామ్ లోని సెయింట్ బార్తోలోమ్యూస్ చర్చిలో జరిగిన వేడుకలకు యుకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో క్రైస్తవ కుటుంబ సభ్యులు,సంస్థ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
కార్యక్రమంలో ముందుగా క్రిస్మస్ పర్వదిన విశిష్టత, ఏసు వైభవాన్ని కొనియాడుతూ గీతాలను ఆలపించారు. చర్చిలో ని మతపెద్దలు ప్రజలు క్షేమంగా ఉండాలని…సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ జాగృతి నాయకుడు హైదర్ ఆత్మకు శాంతి చేకూరలని, భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనో దైర్యం కలిగించి, ఈ బాధ నుండి బయటకు వచ్చేలా దీవించాలని ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, శాంటాక్లాజ్ ల వేషధారణలు పిల్లలు, పెద్దలను అలరించాయి.
ఈ వేడుకలలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ, ప్రతీ మానవుడు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను అచరించినప్పుడే సమాజంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయన్నారు. సమసమాజ స్థాపనే ప్రతి మానవుని అభిమతం కావాలన్నారు. కుల మతాల కంటే మానవత్వం చాలా గొప్పదని, మనమంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ మానవత్వాన్ని ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాల ప్రజలు కలిసి ఉంటారని ఒకరి సంస్కృతిని ఇంకొకరు గౌరవించుకుంటారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, మనమంతా అన్ని సందర్భాల్లో వారి వెంట ఉండాలని కోరారు. ఈ సందర్భంగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ …దీనజనోద్ధరణకు మహాప్రభు మానవ జన్మ ఎత్తి అభాగ్యులను అక్కున చేర్చుకున్నారన్నారు. పాపులను క్షమించి.. వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించినట్లు తెలిపారు. కులమత, ప్రాంతీయ భేదాలు లేకుండా దేవుని నామస్మరణలతో పాపాలను ప్రక్షాళన చేసుకోవాలన్నారు.
ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు మాట్లాడుతూ ఈ లోకమంతా ఆయురారోగ్యాలతో…సుఖ సంతోషాలతో..పిల్లా పాపలతో.. సకల సంపదలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా తాను ప్రభువును వేడుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలను ఇంకా వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ…అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి ఏసుక్రీస్తు పునఃజన్మించారన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమ ప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపనకై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చాడన్నారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు.
ఈస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ రమేశ్ ఎస్సంపల్లి మాట్లాడుతూ …. కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా, అన్ని మతాలని గౌరవిస్తూ… ఈస్ట్ లండన్ లో క్రిస్మస్ వేడుకలని జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దొంతుల వెంకట్ రెడ్డి, సభ్యులు సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ కుమార్ వీర ,సెక్రటరీ శ్రీధర్ రావు తక్కెళ్లపల్లి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , నార్త్ లండన్ ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ అంతగిరి ,వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ , ఈవెంట్స్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్ ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,చిత్తరంజన్ రెడ్డి , శివాజీ షిండే , వినోద్ చెన్నా, సంస్థ కుటుంబ సభ్యులు జొసెఫ్, నందిని, శ్రీలత వర్మ, సుమ,స్వాతి, శారధ, స్వప్న, మేరీ, దీప్తి, అపర్ణ హాజరయ్యారు.