అనిల్ కూర్మాచలంను అభినందించిన మంత్రి కేటీఆర్‌..

40
minister ktr
- Advertisement -

దశాబ్దానికి పైగా టిఆర్ఎస్ పార్టీ కోసం లండన్ కేంద్రంగా పని చేస్తున్న టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలంను మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. యూకే పర్యటనలో భాగంగా గత మూడు రోజులుగా వివిధ వ్యాపార వాణిజ్య వర్గాలతో సమావేశమవుతూ బిజీ బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్, శనివారం అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం కుటుంబ సభ్యులు కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దశాబ్దానికి పైగా లండన్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం మరియు టిఆర్ఎస్ పార్టీ కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల వివరాలను కేటీఆర్‌కు అనిల్ కూర్మాచలం వివరించారు.

తెలంగాణ బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్ కు వివరాలు అందిస్తూ అనిల్ కూర్మాచలం కూతురు నిత్య రాసిన లేఖకు, క్వీన్ నుంచి వచ్చిన ప్రశంసను తెలుసుకున్న మంత్రి కేటీఆర్ నిత్యను అభినందించారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డ పట్ల తెలంగాణ పట్ల అనేక సవాళ్లను దాటుకొని గత దశాబ్దకాలంగా అనిల్ కూర్మాచలం, ఆయన బృందం, టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ చేసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాంతం ఏదైనా, దేశమేదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులే అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -