కరోనా బాధితులకు అండగా ఎన్నారై స్వచ్ఛంద సంస్థలు..

150
corona
- Advertisement -

దేశంలో ఏర్పడిన తీవ్ర కరోనా సంక్షోభం పట్ల ప్రవాస తెలంగాణ సమాజం, తెరాస అమెరికా విభాగం, ప్రవాస తెలంగాణ ప్రముఖులు తెలంగాణ సమాజానికి తమ బాధను మరియు బాధితులకు సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణాలో వివిధ ఎన్నారై స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు వ్యక్తులు చేస్తున్న సేవ కార్యక్రమాలను కొనియాడారు.

ఎన్నారైలు సహాయ కార్యక్రమాలు చేపట్టి కరోనా బాధితులను ఆదుకోవడానికి ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ మరియు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు పట్ల ఎన్నారైలు చర్చించి స్థిరమైన సంక్షేమ పాలన కేసీఆర్ తోనే సాధ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ మరియు సమాజహితం ముఖ్యమన్నారు. సబ్బండ వర్గాలకు కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కెసిఆర్ గారి నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే నాయకుడు కేసీఆర్ అని, ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు చేపట్టి సబ్బండ వర్గాల ఆమోదం పొందిన ప్రజా ప్రభుత్వం అని ఎన్నారైలు చందు తాళ్ల, పూర్ణ బైరి, శ్రీనివాస్ గనుగొని, వెంగల్ జలగం, భాస్కర్ పిన్న, మహేష్ పొగాకు, రిషికేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ కొనియాడారు.

- Advertisement -