పీవీకి ఘన నివాళి

21
- Advertisement -

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన మహేష్ బిగాల ప్రవాసులతో కలిసి ఈరోజు సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో పీవీ నర్సింహా రావు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ శాండీ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొన్నారు.

మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాల‌ను గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వ‌హించింద‌న్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేశారని గుర్తు చేశారు. పీవీకి భారతరత్నను సాధించే దిశగా మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారైలను అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి ఏకంగా ఆన్ లైన్ లో ఓ పెద్ద ఉద్యమాన్నే చేసిన విషయాన్ని గుర్తు చేసారు. కేంద్ర ప్రభుత్వానికి చేంజ్.ఆర్గ్ ద్వారా ఒక పిటిషన్ సబ్మిట్ చేసారు. కొద్దిగా సమయం తీసుకున్నా పీవీ గారికి గారికి భారతరత్న ఇచ్చినందుకు ఎన్నారైలు అందరి తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారైలు అందరూ హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో శాండీ రెడ్డి, కారి రెడ్డి, రాజేష్ గిరి, రాపోలు కిషోర్ బేండే, రవి దూపాటి, రాహుల్ రాంపల్లి, చిరాన్ పురంశెట్టి, రవి శంకర్ రేణుకుంట, కృష్ణ దేవతి,హేమంత్ గంగు, సునీల్, శంకర్ మిత్రులు అలాగే సీనియర్ సిటిజన్స్ నారాయణ రెడ్డి, నాగేశ్వర రావు, జార్జ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:Harish:కాంగ్రెస్‌ పాలన అంటే విచారణ,వేధింపులు

- Advertisement -