తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గారి ఆకాల మరణం యావత్ ప్రవాస తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
లండన్ నగర సమీప రీడింగ్ పట్టణం లో ఏర్పాటు చేసిన సాయి చంద్ సంస్మరణ కార్యక్రమంలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు.ఉద్యమ సమయం నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్నందున మాకు సాయిచంద్ తో మంచి అనుబంధముందని, మేము చేసే కార్యక్రమాల్ని మీడియా ద్వారా తెలుసుకొని మాలో చాలా మందికి ఫోన్ చేసి అభినందించి ప్రోత్సహించే మంచి వ్యక్తిత్వం, సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉన్నవారు సాయిచంద్ అని గుర్తుచేసుకున్నారు.
ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా మరణించడాన్ని జీర్నించుకోలేకపోతున్నామని, వారు బౌతికంగా మన మధ్య లేకపోయినా వారి పాటల రూపంలో మన మధ్యే ఎల్లపుడూ చిరంజీవిగా ఉంటాడని అశోక్ తెలిపారు.మా సంస్థల వ్యవస్థాపకులు, ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం గారు ఎన్నికల తరువాత ఖచ్చితంగా సాయిచంద్ ను లండన్ తీసుకెళ్ళాలని ఇటీవల లండన్ వచ్చినప్పుడు చెప్పారని, ఇంతలోనే ఇలా జరగడం ఎంతో బాధగా ఉందని సతీష్ రెడ్డి బండ తెలిపారు.
Also Read:ఎన్సీపీ నాశనం.. బీజేపీ కుట్రే!
మా ప్రవాసులందరి పక్షాన వారి కుటంబానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నామని, స్వదేశానికి వచ్చిన వెంటనే, వారి కుటుంబాన్ని కలుస్తామని, భగవంతుడు వారి కుటంబానికి ఈ విషాదాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని సీనియర్ నాయకుడు బీరం మల్లా రెడ్డి తెలిపారు.జోహార్ సాయి చంద్ జోహార్ జోహార్….తెలంగాణ నేల నిన్ను ఎప్పటికీ మరవదని అంటూ ప్రవాసులు నినదించారు.ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్ దూసరి,బీరం మల్లా రెడ్డి, జాహ్నవి,సతీష్ రెడ్డి బండ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
Also Read:బీజేపీ గుట్టు విప్పిన రఘునందన్..?