కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1
సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. జనవరి 8న హీరో యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా గత ఏడాది ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా ఈసారి కూడా యష్ బర్త్ డే కానుకగా ‘కేజీఎఫ్ 2’ నుంచి టీజర్ వస్తుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశించారు. అయితే అలాంటిదేమీ లేనట్టు తెలుస్తోంది.
దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.