పోలీసులపై మరో కార్పొరేటర్ దురుసు ప్రవర్తన..

88
police
- Advertisement -

హైదరాబాద్‌లో పోలీసులపై రెచ్చిపోయారు మరో ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి. పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లీంలు మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలకోసం వచ్చారు. వారికి వాహనాలు పార్కింగ్ చేసుకొనేందుకు యానాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ దఫా అలాంటి ఏర్పాట్లు చేయలేదు.

దీంతో ముస్లింలు రహదారిపై పార్కింగ్ చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాగా అక్కడికి వచ్చిన స్ధానిక కార్పొరేటర్ యానామి ఆస్పత్రి గేట్లు తెపిరించాడు. అయితే ట్రాఫిక్ జామ్ అయిందన్న సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ, పోలీసులు అక్కడి చేరుకున్నారు. దీంతో మీరెందుకు వచ్చారు.. మీకు ఇక్కడ ఏం పని అంటూ ఎస్ఐపై మజ్లిస్ కార్పొరేటర్ మండిపడ్డాడు. ఎస్‌ఐ సర్దిచెప్పే ప్రయత్నం చేసిన వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాదు వార్నింగ్ కూడా ఇచ్చాడు.

ఇప్పటికే భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై దరుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్‌కాగా తాజాగా మరో కార్పొరేటర్‌ వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -