- Advertisement -
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం భారత్‌లో వినిమోగదారులకు మరింత చేరువ కావడానికి మరో ముందడుగు వేసింది. భారతీయ భాషల్లోకి వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పావులు కదిపింది.
తమిళం, తెలుగు, కన్నడం భాషలను ఫ్లిప్ కార్ట్ వేదికపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది హిందీ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు తమిళం, తెలుగు మరియు కన్నడ ఇంటర్‌ఫేస్‌లను జోడించింది.
స్థానిక భాషలో ఎండ్-టు-ఎండ్ ఈ -కామర్స్ ప్రయాణాన్ని సులభం చేయడానికి ఈ ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అంతేగాదు వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగాఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
- Advertisement -