అఖండ బాలయ్య కోసం దర్శకుల క్యూ!

98
NBK
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు అఖండ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో NBK 107 చేస్తున్న బాలకృష్ణ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు.ఈ రెండు సినిమాల తర్వాత త్రివిక్రమ్‌తో సినిమాకు కమిట్ అయ్యారు.

ఇక ఈ సినిమాలన్ని లైన్లో ఉండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశారు. దర్శకుడు కొరటాలతో ఓ సినిమాకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కొరటాలతో పాటు పూరి జగన్నాథ్‌ తో కూడా సినిమాను చేయడానికి అంగీకరించారు బాలయ్య.

అలాగే తన ఆస్ధాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది అఖండకు సీక్వెల్‌గా ఉండనుందని టాక్‌. అలాగే దర్శకుడు కృష్ణ వంశీ కూడా బాలయ్య కోసం రైతు పేరుతో కథను సిద్ధం చేసుకోగా నిర్మాతలు దిల్ రాజు, సి కల్యాణ్‌ బాలయ్య సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ టాప్ దర్శకులంతా ఇప్పుడు బాలయ్య డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అఖండ హిట్ తర్వాత బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగిపోవడంతో దర్శకులు క్యూ కడుతున్నారిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -