మేడారంకు హెలికాప్టర్ సేవలు.. చార్జీలు ఇవే..!

73
- Advertisement -

సమ్మక్క-సారక్క మహాజాతర ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాలుగా పేరుగాంచాయి. కాగా, మేడారం జాతరకు వెళ్లేవారికోసం హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. తంబి ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ హెలికాప్టర్ సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్లు నడపనుంది. ఒకరికి రానుపోను చార్జీలు రూ.19,999 అని వెల్లడించారు. అదే, హైదరాబాద్ నుంచి మేడారంకు రూ.75,000 చెల్లించాలి. మేడారం జాతర విహంగ వీక్షణం కోసం మరో రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు షురూ అవుతాయి.

- Advertisement -