ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఆరు సార్లు ఛాంపియన్,ఆస్ట్రేలియా ఓపెన్ కింగ్ నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. దక్షిణ కొరియాకు చెందిన ఆటగాడు చుంగ్ హెయన్ చేతిలో జకోవిచ్ ఓటమిపాలయ్యాడు. హోరాహోరిగా జరిగిన మూడు సెట్ల మ్యాచ్‌లో జకోకు షాకిచ్చాడు చుంగ్.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు చుంగ్ హెయన్ సోమవారం సంచలన విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన మూడు సెట్ల మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్‌కు షాకిచ్చాడు చుంగ్.
7-6, 7-5, 7-6 తేడాతో జకోవిచ్‌ను మట్టికరిపించాడు. దీంతో దక్షిణ కొరియా నుంచి ఓ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు చుంగ్. మూడు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లు టై బ్రేకర్‌లోనే ఫలితం తేలాయి. గతంలో జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు. గతేడాది కూడా జకోవిచ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.