రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్…

100
trs
- Advertisement -

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వద్దిరాజుతో పాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా ఆ రెండూ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురయ్యాయి.

ఇక ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -