అకిరా కోసం పవన్‌..రేణు ఎమోషనల్!

46
pawan
- Advertisement -

విడాకుల తర్వాత తొలిసారి రేణు దేశాయ్‌ని కలిశారు పవన్‌. అకిరా నందన్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుండగా స్కూల్ లో జరిగిన గ్రాడుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్‌. తండ్రిగా బాధ్యత తీసుకొని పవన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. రేణు దేశాయ్ కూడా తల్లి స్థానంలో ఈ కార్యక్రమానికి రాగా చాలా సంవత్సరాల తర్వాత పవన్, రేణు దేశాయ్, అకిరా, ఆద్య కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్, రేణు దేశాయ్ ఇలా కలవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఫోటోని వైరల్ చేసేస్తూ ఖుషీ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్.

ఇక రేణు దేశాయ్ కూడా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. నా కొడుకు అప్పుడే పెద్దోడైపోయాడు, ఇక్కడి నుంచి తన సొంత కాళ్ళ మీద మీద నిలబడాలి అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టింది.

- Advertisement -