కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్)-2019లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్ https://tsmedadm.tsche.in/ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 22 ఉదయం 8 గంటల నుంచి 28 సాయింత్రం నాలుగు గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ ఏక్సప్లోరర్ 11 వెర్షన్ కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. 28 రాత్రికి మెరిట్ జాబితా రూపొందిస్తామన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ 29 నుంచి ప్రారంభం కానుంది. వెరిఫికేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in , www.knruhs.telangana.gov.in లో చూడొచ్చని తెలిపారు.
జనరల్ ,ఇ డబ్ల్యుఎస్ అభ్యర్థులు 50 పర్సెంటైల్ 134 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 40 పర్సెంటైల్ 107 మార్కులు, దివ్యాంగులు (ఓసి) 45 పర్సెంటైల్ 120 మార్కులుగా కటాఫ్ ఎంసీఐ నిర్ణయించింది.