స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం..

283
MPTC, ZPTC elections
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికల జోరు కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితమే శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ ఓట్ల లెక్కింపు చేపట్టకముందే మరో ఎన్నికలు వచ్చాయి. త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు మ ముమ్మరం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్..

-ఏప్రిల్ 20న షెడ్యూల్.

-ఏప్రిల్ 22 మొదటి విడత నోటిఫికేషన్.

-మే 6 వ తేదీన పోలింగ్.

-ఏప్రిల్ 26 రెండవ విడత నోటిఫికేషన్.

-మే 10 వ తేదీ న పోలింగ్.

-ఏప్రిల్ 30 న మూడవ విడత నోటిఫికేషన్.

-మే 14న పోలింగ్.

3 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు..

-మొదటి విడతలో 212 జెడ్పిటిసిలు, 2365 ఎంపిటిసిలు.

-రెండవ విడతలో 199 జెడ్పిటిసిలు, 2109 ఎంపీటీసీలు.

-మూడవ విడతలో 124 జెడ్పిటిసిలు, 1343 ఎంపిటిసిలు.

-మొత్తం 535 జెడ్పిటిసిలు, 5817 ఎంపీటీసీలు.

-ఒక్క కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లు.

-32007 పోలింగ్ కేంద్రాలు.

- Advertisement -