తెలుగు ఫిలిం చాంబర్‌పై ఆర్జీవీ ఫైర్

213
Nothing to be ashamed
- Advertisement -

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులు ముఖ్యంగా అకున్ సబర్వాల్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఫిలిం చాంబర్ పై మండిపడ్డారు. సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం, డ్రగ్ స్కాండల్ కాదన్న వర్మ ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా  అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం బాగాలేదన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు  చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు?….అలాగే అపాలజీ లెటర్ లో అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం”- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం రుజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి? అంటూ వర్మ ప్రశ్నించాడు.

రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే  ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ  చెప్పాలి.  ఆ నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం “మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలని సూచించాడు.ఫిలిం చాంబర్‌పై ఆర్జీవీ రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -