బ్లాక్ మనీని..నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రధాన మంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు ద్వారా కొత్తగా మార్కెట్ లోకి వచ్చే 2000. 500 నోట్లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారని దేశవ్యాప్తంగా పెద్ద ప్రచారమే జరిగింది. బ్లాక్ మనీని..నకిలి నోట్ల ను పూర్తీగా రూపుమాపేందుకు కొత్తగా వచ్చే 2000, 500 నోట్లలో నానో జీపీఎస్ చిప్ ఉంటుందని. నోట్ల లో ఉన్న చిప్ ద్వారా ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వానికి ఇట్టే తెలిసిపోతుందని..ఇక బ్లాక్ మనీకి ఛాన్సే లేదనుకున్నారు.
అలాగే చిప్ ద్వారా నకిలీ నోట్ల భరతం పట్టొచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలంతా ఇది నిజమే అనుకున్నారు. కానీ తీరా ఆర్భిఐ అధికారులు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. కొత్తగా వచ్చే 2000 , 500 నోట్ల లో ఎలాంటి నానో జీపీఎస్ చిప్ లేదని తేట తెల్లం చేశారు. దీంతో మళ్లీ బ్లాక్ మనీ, నకిలి నోట్ల బెడద మళ్లీ తప్పని కొంతమంది నిరాశకు గురైతే. ఇంకొంత మందేమో ఊపీరి పీల్చుకున్నారు. ఏదైమైనా కొత్త నోట్లలో నానో చిప్ పెట్టక పోవడానికి కారణమేంటో ఆర్భిఐ పెద్ద లు తెలియజేశారు.
కొత్తగా విడుదలైన రూ.2వేలు, 500 నోట్లలో నానో చిప్ లేదా పార్టికిల్ (కణాలు) పెట్టాలనుకున్న మాట వాస్తవమేనని ఆర్‌బీఐ ప్రకటించింది. కానీ, అది అధిక వ్యయంతో కూడుకున్న ప్రక్రియ కావడంతో ఆ ప్రతిపాదన విరమించామని ఆర్‌బీఐ అధికారి ఒకరు బెంగళూరులో తెలియజేశారు. అంతే కాక ఆ నోట్ల కోసం ప్రత్యేక స్కానింగ్ యంత్రాలు కూడా అవసరమని, అది మరింత భారం కావడంతో పూర్తిగా వెనక్కు తగ్గామని చెప్పారు.