టాలీవుడ్‌లో సంచలనంగా మారిన యువహీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి,గీతగోవిందం వంటి హిట్ సినిమాలతో జోష్ మీదున్న విజయ్ తాజాగా నోటా అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఆనంద్ శంకర్ తెరకెక్కించారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన విజయ్.. ఇప్పుడు ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. నోటాతో విజయ్ హ్యాట్రిక్ కొట్టాడా..?ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..
కథ:
వాసుదేవ్(నాజర్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవినీతి ఆరోపణలు రావడంతో జైలుకు వెళ్తాడు. జ్యోతిష్యాన్ని తెగ నమ్మే వాసుదేవ్ కొడుకు వరుణ్(విజయ్ దేవరకొండ)ను సీఎం చేస్తాడు. ముఖ్యమంత్రి అయినా జాలీలైఫ్‌ను అనుభవించే హీరో విజయ్ చివరకు సీరియస్ ముఖ్యమంత్రిగా ఎలా మారాబు ? అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఎలా నడుస్తుందో ? అన్నదే
సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ విజయ్ దేవరకొండ,పొలిటికల్ డ్రామా. హీరో పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోతానని మరోసారి నిరూపించాడు హీరో విజయ్. యంగెస్ట్ సీఎంగా ప్రేక్షకులను కట్టిపడేశాడు. యువ జర్నలిస్టుగా మెహ్రీన్ కట్టిపడేసింది. సీనియర్ నటులు నాజర్,సత్యరాజ్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ప్రియదర్శి,భాస్కర్ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,కామెడీ లేకపోవడం,సెకండాఫ్. సినిమా అంతా సీరియస్‌గానే ఉండడం, సెకండాఫ్‌లో చాలా బోర్ సన్నివేశాలు, కామెడీ లేకపోవవడంతో సినిమా అంచనాలు ఏ మాత్రం అందుకోలేదు. తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉండడం మైనస్ పాయింట్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. తమిళ నేటివిటికి కనెక్ట్ కావడం,సెకండాఫ్ మొత్తం తెలిపోయేలా చేశాడు దర్శకుడు ఆనంద్ శంకర్.కథలో దమ్ము లేకపోవడంతో సినిమా తేలిపోయింది. శక్తీకాంత్ కార్తీక్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ బాగుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
ఇప్పటి వరకు ప్రేమ, ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ. రొటీన్‌కు భిన్నంగా కొత్తగా ట్రై చేసినా కథలో దమ్ము లేకపోవడంతో సినిమా యావరేజ్‌గా నిలిచింది. సెకండాఫ్‌పై దృష్టి పెడితే బాగుండేది. ఓవరాల్‌గా తెలుగు ప్రేక్షకులకు పర్వాలేదనిపించే మూవీ నోటా.
విడుదల తేదీ:05/10/2018
రేటింగ్:2.5/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా
సంగీతం: శక్తీకాంత్ కార్తీక్
నిర్మాత:స్టూడియో గ్రీన్
దర్శకుడు: ఆనంద్ శంకర్