బండి భగీరథ్‌కు దక్కని ఊరట

3
- Advertisement -

బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు నిరాకరించింది. అలాగే తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. పిటిషన్‌పై అర్ధరాత్రి 11.45 గంటల వరకు సుదీర్ఘ వాదనలు వినిపించింది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ చూశాక మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయలేమని హైకోర్టు తెలిపింది.

పోక్సో కేసులో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ వేశారు భగీరథ్. వచ్చే గురువారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు లాయర్ నాగేశ్వర్‌రావు. పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు నిరంజన్‌ రెడ్డి.

Also Read:తిలక్ వర్మపై అర్ష్‌దీప్ కామెంట్‌?

బాధితురాలు మైనర్‌ అని కోర్టుకు తెలిపారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్. బాధితురాలి పుట్టిన రోజు 12 ఆగస్టు,2008 అని తెలిపింది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్. పీపీ వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం.

- Advertisement -