తిలక్ వర్మపై అర్ష్‌దీప్ కామెంట్‌?

5
- Advertisement -

పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మతో కలిసి తీసిన ఒక స్నాప్‌చాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అందులో అర్ష్‌దీప్ చేసిన వ్యాఖ్యలు జాత్యహంకార పూరితంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ మరియు నమన్ ధీర్‌లతో కలిసి కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ తిలక్ వర్మను ఉద్దేశించి “అంధేరే” (చీకటి అని అర్థం) అని పిలిచారు. మొదట తిలక్ దీనిని పట్టించుకోనప్పటికీ, అర్ష్‌దీప్ మళ్ళీ జోక్యం చేసుకుంటూ.. తిలక్ సన్‌స్క్రీన్ వాడాలని సరదాగా వ్యాఖ్యానించారు.

అదే సమయంలో పక్కనే ఉన్న నమన్ ధీర్‌ను చూపిస్తూ, పంజాబ్‌కు చెందిన అసలైన “నూర్” (వెలుగు అని అర్థం) ఇతనేనని పేర్కొన్నారు. నమన్ దీని అర్థాన్ని తిలక్‌కు వివరిస్తుండగా, “నేను ఇప్పటికే సన్‌స్క్రీన్ రాసుకుంటున్నాను” అని తిలక్ బదులిచ్చారు.

ఈ సంభాషణ స్నేహపూర్వకంగా జరిగినట్లు అనిపించినప్పటికీ, నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. తిలక్ వర్మ చర్మ రంగును ఉద్దేశించి అర్ష్‌దీప్ చేసిన వ్యాఖ్యలు జాత్యహంకార ధోరణిలో ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐ (BCCI) కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసిన వారం రోజుల్లోనే ఈ వివాదం తలెత్తడం గమనార్హం.

 

Also Read:డైటింగ్ కంటే ఇలా చేస్తేనే మేలు?

- Advertisement -