Chandrababu: కుట్రదారు చంద్రబాబే..నాకేం తెలియదు!

39
- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు జైలా లేదా బెయిలా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు చంద్రబాబు. తన అరెస్ట్ అక్రమమని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని చంద్రబాబు కోర్టుకు విన్నవించారు.

చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా,సీఐడీ తరపున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక రిమాండ్ రిపోర్టులో ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని తెలిపింది సీఐడీ. ఈ మేరకు 28 పేజీల రిపోర్టును సమర్పించగా చంద్రబాబును 15రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరింది సీఐడీ.

ఇక ఈ రిమాండ్ రిపోర్టులో లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. సీమెన్స్ సహా ఇతర కంపెనీల ప్రతినిధులు ఇల్లందుల రమేశ్ ద్వారా కలిసిన తర్వాత ఈ ఒప్పందం జరిగిందన్నారు. బాబు, అచ్చెన్నాయుడు కలిసి స్కాం చేశారని వెల్లడించింది. వివిధ కంపెనీల నుంచి డబ్బు కిలారు రాజేశ్ ద్వారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, పీఏ శ్రీనివాస్‌కు చేరిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దీంతో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అని సర్వత్రా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

Also Read:చాకలి ఐలమ్మ..బహుజన చైతన్యానికి ప్రతీక

- Advertisement -