`స్పైడ‌ర్‌`కు దాని అవసరం లేదట…

193
- Advertisement -

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్’. మహేష్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ దసరాకి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది…అయితే సాధార‌ణంగా సినిమా ప్రారంభానికి ముందు `మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం` అని హెచ్చ‌రిక జారీ చేస్తుంటారు. సినిమాలోని పాత్ర‌లు మ‌ద్య‌పానం, ధూమ‌పానం సేవిస్తున్న‌పుడు కింద ఈ హెచ్చ‌రిక క‌నిపిస్తుంటుంది.

'NoSmoking' Ads in SPYder

కానీ మ‌హేశ్‌బాబు `స్పైడ‌ర్‌` సినిమాకు దాని అవ‌స‌రం లేదట. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్క‌డా హీరో మ‌హేశ్ గానీ, విల‌న్ ఎస్‌జే సూర్య గానీ మందుకొడుతున్న‌ట్లు, పొగ తాగుతున్న‌ట్లు చూపించ‌లేద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా మ‌ద్య‌పానానికి బ‌దులు విల‌న్ సూర్య గ్రీన్ టీ తాగుతూ క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే `స్పైడ‌ర్‌` సినిమా హిందీ వెర్ష‌న్‌కి ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు మ‌ద్య‌పానం హెచ్చ‌రిక వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమోదం కూడా ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఇక తెలుగు వెర్ష‌న్‌కి కూడా అలాంటి ఆమోద‌మే ల‌భిస్తుంద‌ని నిర్మాత‌లు అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

'NoSmoking' Ads in SPYder

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

- Advertisement -