ఆ విషయంలో అమ్మాయిలకే తొందర..!

179
Girls Intrested In First Dating Choice
- Advertisement -

నార్వేకు చెందిన నార్వేజియన్ యూనిర్శిటీ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొపెసర్లు డేటింగ్ పై సర్వే జరిపారు. ఈ సర్వేలో 10 నుంచి 25 సంవత్సరాల వయసు గల అమ్మాయిలను, అబ్బాయిలను పరిశీలించగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అబ్బాయిల కంటే అమ్మాయిలే డేటింగ్ కోసం తొందర పడుతున్నారని ఈ సర్వేలో  తేలింది.Girls Intrested In First Dating Choice

నేటి యువత డేటింగ్ కోసం షార్ట్ కట్స్ వెతుకుతున్నారని, అందుకోసం చాలా మంది యువతి, యువకులు ‘టిండర్’ అనే యాప్‎ను వాడుతున్నారని చెప్పింది. ఈ యాప్ వాడుతున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని తేలిందని. ఈ యాప్ ద్వారా అమ్మాయిలు అబ్బాయిల వ్యక్తిగత వివరాలు, వృతి వంటివి తెలుసుకుని ఓ నిర్ణయానికి వస్తున్నారని, ఒక వ్యక్తిని మాత్రమే ఇష్టపడుతున్నారని ఈ సర్వే చెబుతోంది.

కానీ అబ్బాయిల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, ఒకే సమయంలో ఎక్కువ మంది అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్నారని, ఒక అమ్మాయి నచ్చకపోతే వెంటనే వేరే అమ్మాయికి ప్రపోస్ చేస్తున్నారని చెప్పింది. పరిచయం అయిన అమ్మాయిలతో ఎప్పుడు కలవాలి.. అని అబ్బాయిలు ఎదురు చూస్తున్నారంది, ఈ టిండర్ అనే యాప్ షార్ట్ టర్మ్ డేటింగ్‎కి చాలా మంది యూస్ చేస్తున్నారని ఈ సర్వే చెబుతోంది. కొందరు అబ్బాయిలు మాత్రం నచ్చిన అమ్మాయి కోసం వేచి చేస్తున్నారని, వివాహ సంబంధం కోసం వెతుకుతున్నారని చెప్పింది.

- Advertisement -